ఆమ్లా..కోహ్లీ రికార్డును దాటేస్తాడా.. అతనికి ఇదే ఆఖరి ప్రపంచకప్‌?

ఆమ్లా..కోహ్లీ రికార్డును దాటేస్తాడా.. అతనికి ఇదే ఆఖరి ప్రపంచకప్‌?

ప్రపంచ కప్ మెుదలైంది. తొలి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహా క్రీడా సంగ్రామం గురువారం మెుదలవుతుండడంతో క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అన్ని జట్లు సమఉజ్జీలుగా ఉండడంతో ఎవరు గెలుస్తారు అనే దానిపై అందరికి ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్‌గా ఇంగ్లాండ్ ఉన్నా.. ఆస్ట్రేలియా,ఇండియా జట్లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.

అయితే గురువారం జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఆమ్లా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న రికార్డును బద్దలుకొడతాడనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఆమ్లా మరో 90 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. అంతకుముందు విరాట్ ఈ ఘనతను 175 ఇన్నింగ్స్‌లో సాధించాడు. ఇప్పటివరకు ఆమ్లా 171 ఇన్నింగ్స్‌లో 7910 పరుగులు పూర్తి చేశాడు. మంచి హిట్టింగ్‌తో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆమ్లా.. వన్డేల్లో 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులను వేగంగా చేరుకున్నాడు.

అలాగే మరో రికార్డుకు అడుగు దూరంలో ఆమ్లా ఉన్నాడు. 8వేల పరుగుల మైలురాయిని అతను సాధిస్తే దక్షిణాఫ్రికా తరఫున 8వేల పరుగులు పూర్తిచేసిన నాలుగో ఆటగాడిగానూ అతడు నిలుస్తాడు. అంతకుముందు సఫారీ అటగాళ్ళు కలీస్‌(11550), డివిలియర్స్‌ (9427), హార్ష్‌లేగిబ్స్‌(8094) ఆమ్లాకన్నా వేగంగా పరుగులు చేసినవాళ్ళలో ఉన్నారు. అలాగే ఆమ్లా ఈ మ్యాచ్‌లో మరో 37 పరుగులు చేస్తే మాత్రం ఇంగ్లాండ్‌పై వన్డేల్లో వెయ్యి పరుగులు చేసిన రెండో దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డులోకి ఎక్కుతాడు. అయితే అతను ఫామ్‌లో లేడు. గత ఏడాది నుంచి తనస్థాయికి తగ్గ బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడు. 36 ఏళ్ల ఆమ్లాకి బహుశా ఇదే ఆఖరి ప్రపంచకప్‌ కావచ్చు. ఇది సఫారీలకు కొంత ఆందోళన కలిగించే అంశం. టాప్ బ్యాట్స్‌మెన్ పై అశలు పెట్లుకున్న దక్షిణాఫ్రికా జట్టు ఆమ్లా ఫామ్‌లోకి రాకపోతే ఇబ్బంది పడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story