క్రికెట్ వరల్డ్ కప్.. క్వీన్ ఎలిజబెత్‌ను కలిసిన..

క్రికెట్ వరల్డ్ కప్.. క్వీన్ ఎలిజబెత్‌ను కలిసిన..

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. గురువారం నుంచే వన్డే ప్రపంచకప్ వేట మొదలైంది. ‌ప్రారంభోత్సవ వేడులను అట్టహాసంగా నిర్వహించారు. లండన్ లోని బకింగ్ హాల్‌కి సమీపంలో ఈ వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో మాజీ క్రికెటర్లు, కొందరు ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. దాదాపు 4 వేల మంది అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు. ముందుగా ఈ టోర్నీ ఆడుతున్న పది దేశాల కెప్టెన్లను ఒకరి తర్వాత మరొకరిని వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం పది దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు, ప్రముఖులతో అరవై సెకన్ల పాటు సాగే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మే 30 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి

అంతకు ముందు విరాట్ కోహ్లి సహా… వరల్డ్ కప్‌లో తలపడుతున్న వివిధ జట్ల కెప్టెన్లు బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో క్వీన్ ఎలిజబెత్‌ను కలిశారు. . జూన్ 5న భారత్.. దక్షిణఫ్రికాతో మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మెగా టోర్నీని 11 వేదికల్లో 46 రోజుల పాటు నిర్వహించనుండగా.. మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూలై 14న లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో భాగంగా ప్రతి జట్టు లీగ్ దశలో 9 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story