ఎన్సీపీ.. కాంగ్రెస్ లో విలీనం అవుతుందా?

ఎన్సీపీ.. కాంగ్రెస్ లో విలీనం అవుతుందా?

ఏన్సీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా? అన్ని కలిసొస్తే సెప్టెంబర్ లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకన్న ముందే ఈ ప్రక్రియ పూర్తికానుందా? ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో రాహుల్ గాంధీ సమావేశం కావడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీలో సమావేశమైన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.. ముఖ్యంగా ఎన్సీపీని కాంగ్రెస్ లో మెర్జ్ చేయడంపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 స్థానాల్లో విజయం సాధించగా.. ఎన్సీపీ -5 చోట్ల మాత్రమే విజయం సాధించింది.

ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10 శాతం అంటే 54 సీట్లు రావాలి. అంటే కాంగ్రెస్ కు మరో ఇద్దరు ఎంపీలు కావాలి. ఎన్సీపీ విలీనం అయితే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకు అర్హత సాధిస్తుంది.. అలాగే సెప్టెంబర్ లో జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇది ఉపయోగడుతుంది.. శివసేన-బీజేపీ కూటమిని కూడా ధీటుగా ఎదుర్కోవచ్చు..అందుకే ఎన్సీపీ, కాంగ్రెస్ ఆ దిశగా చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. 1999లో కాంగ్రెస్ నుంచి వేరు కుంపటి పెట్టిన శరద్ పవార్, పీఏ సంగ్మా, తారీక్ అన్వర్ ఎన్సీపీ పార్టీని స్థాపించారు. సోనియాగాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని విభేదిస్తూ ఈ ముగ్గురు అప్పట్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఎన్సీపీని స్థాపించారు. కానీ యూపీఏ-1, యూపీఏ-2 హయాంలో ఎన్సీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.

Tags

Next Story