బైక్స్‌పై బంపరాఫర్.. సగానికి పైగా తగ్గింపు..

బైక్స్‌పై బంపరాఫర్.. సగానికి పైగా తగ్గింపు..

ఓ మాంచి బైక్ కొనాలనుకుంటే ఈ బంపరాఫర్ మీ కోసమే. 10, 20 కాదు ఏకంగా 55% డిస్కౌంట్ అందిస్తోంది ఓ షోరూమ్. ట్రయంఫ్ బైక్స్‌పై ఈ భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని ఒక డీలర్ 30 డెమో, ప్రి-ఓన్డ్ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తున్నారు. వీటి ధర రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్ట్రీట్ ట్విన్ బైక్స్‌పై ఈ ధర వర్తిస్తుంది. ఇక బొన్నెవిల్లే టీ 120 ధర రూ.6.5 లక్షలుగా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌కి సంబంధించినవి. ఈ బైక్స్ 2016-18 మధ్యలో తయారైనవి. బ్రాండ్ న్యూ మోటార్ బైక్స్‌తో పోలిస్తే ఈ డీలర్ ఆఫర్ చేసే బైక్స్ ఏకంగా 55 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. ఒకప్పుడు రేటెక్కువని ఈ బైక్‌పై మోజుపడినా కొనాలనే కోరికను విరమించుకుంటే మాత్రం ఈ ఆఫర్‌ని వినియోగించుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story