ఆంధ్రప్రదేశ్

నూతన పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

నూతన పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
X

YSR పెన్షన్ కానుక పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. అర్హులందరికీ జూలై 1 నుంచి కొత్త పెన్షన్‌ అందుతుంది. ఈ స్కీమ్ కింద వృద్ధులకు 2 వేల 250, వికలాంగులకు 3 వేలు, కిడ్నీ బాధితులకు 10 వేలు చెల్లిస్తారు. వృద్ధుల పెన్షన్‌ వయస్సు కూడా 65 నుంచి 60 సంవత్సరాలకు కుదించారు. ఈ మేరకు జగన్‌ సర్కారు తొలి జీవో విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్‌ పెన్షన్ల పెంపు ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. జూన్‌ 1 వతేదీ నుంచి వృద్ధులకు 2 వేల 250 పింఛను ఇస్తారు. దశలవారీగా దీన్ని౩ వేలకు పెంచనున్నారు.

Next Story

RELATED STORIES