ఈ క్యాచ్ చూస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే..
ప్రపంచ కప్ మెుదటి మ్యాచ్‌లోనే ప్రేక్షకులకు కావల్సినంతా మజా దొరికింది. ఇటు బ్యాటింగ్..అటు ఫిల్డింగ్‌లో ఆటగాళ్ళు అదరగొట్టారు. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. ఔరా అనిపించే బౌండరీలు.. క్రికెట్ అభిమానులను రంజింపచేశాయి. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికా ,ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్ళ విన్యాసాలు అన్ని కనిపించాయి. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్, సపారీలపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ ఆల్‌రౌండర్ ప్రదర్శన సఫారీ జట్టును ఓటమి వైపు నడిపించాడు.
అలౌండర్ అంటే ఇలా ఉండాలి అని నిరూపించాడు స్టోక్స్ . బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో అదరగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. 79 బంతుల్లో 89 పరుగులు చేసిన స్టోక్స్.. రెండు వికెట్లు, రెండు క్యాచ్‌లు, ఒక రనౌట్‌తో మ్యాచ్‌లో వన్ మ్యాన్ షోగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ పట్టిన క్యాచ్ ప్రపంచ్ కప్‌లోనే హైలేట్ నిలుస్తుందోమో. అదిల్ రషిద్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద స్టోక్స్ అందుకున్న ఆండిల్ ఫెహ్లుకోవియా క్యాచ్ గురించే ఇప్పడు ప్రపంచ క్రీడాలోకం చర్చించుకుంటుంది. ఒంటి చేత్తో సూపర్ మ్యాన్‌లా స్టోక్స్ అందుకున్న ఈ క్యాచ్ ది బెస్ట్ క్యాచ్ జాబితిలో తప్పకుండా నిలుస్తోంది
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com