కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్
కిసాన్ యోజన పథకం పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… కిసాన్ యోజన పథకం రైతులందరికీ వర్తింపచేయాలని… గతంలో ఆదాయపన్ను చెల్లించే వారికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది… పార్లమెంట్ సమావేశాల తేదీలను కేబినెట్ ఖరారు చేసింది… జూన్ 17 నుంచి జులై 26 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి… అలాగే జూన్ 19న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు…
భారత రక్షణ నిధి ద్వారా ఇచ్చే స్కాలర్‌షిప్‌లపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది… కేంద్ర పారామిలటరీ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులకూ వర్తించేలా నిర్ణయించింది… బాలురకు స్కాలర్‌షిప్ రెండు వేల రూపాయల నుంచి రెండున్నర వేలకు… బాలికలకు రెండువేల 250 రూపాయల నుంచి మూడు వేలకు పెంచారు… ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాల నుంచి ఎంపిక చేయనున్నారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com