ప్రపంచకప్‌ను భారీ విజయంతో ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లాండ్

ప్రపంచకప్ 2019ను ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు భారీ విజయంతో ప్రారంభించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో ఆ జట్టు సూపర్ విక్టరీ సాధించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 311 పరుగులు చేసింది. ఓపెనర్ బెయిర్ స్టో తొలి ఓవర్‌లోనే డకౌట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ జేసన్ రాయ్, జో రూట్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్‌కు 106 పరుగులు సాధించిన తర్వాత జేసన్ రాయ్ పెవిలియన్ చేరగా, ఆ తర్వాత కొద్దిసేపటికే రూట్ కూడా ఔటయ్యాడు. అప్పుడు మోర్గాన్-బెన్ స్టోక్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టింది. వీరిద్దరూ మరో 106 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మోర్గాన్ నాల్గో వికెట్‌గా ఔటైన తర్వాత జోస్ బట్లర్, మొయిన్ అలీ నిరాశపరిచారు. అయితే బెన్ స్టోక్స్ సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ స్కోర్ మూడొందలు దాటింది. సఫారీ బౌలర్లలో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా,రబడా, తాహీర్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి. ఫెహ్లుకోవియా వికెట్ తీశాడు.
భారీ ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ప్రారంభంలోనే తడబడింది. ఆరంభంలోనే హషీమ్ ఆమ్లా హెల్మెట్ గ్రిల్స్‌కు బంతి బలంగా తాకడంతో రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మార్కమ్, డుప్లెసిస్ త్వరగానే ఔటయ్యారు. అయితే క్వింటన్ డికాక్, రసి వాన్ డెర్ 4వ వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం అందించారు. హాఫ్ సెంచరీ సాధించిన డికాక్‌ను ప్లంకెట్ కీలక సమయంలో ఔట్ చేశాడు. డుమిని, ప్రిటోరియస్ వెంటవెంటనే ఔటయ్యారు. హాఫ్ సెంచరీ తర్వాత డసెన్ కూడా ఔటయ్యాడు. అండిలె ఫెలుక్‌వాయో కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 104 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com