సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య..

సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య..

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో దారుణ హత్య జరిగింది. పట్టపగలే ఓ వ్యక్తిని వేటకొడవళ్లతో నరికి చంపారు దుండగుడు. ముంబై హైవేపై జరిగిన ఈ మర్డర్‌ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అందరూ చూస్తుండగానే యువకున్ని అతి కిరాతకంగా హతమార్చాడు.

విచక్షణ రహితంగా తలపై కత్తితో నరకడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దుండగులు హత్య చేస్తుంటే ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. హత్య అనంతరం నిందితులు బైక్‌పై పరారయ్యారు. ఈ హత్య దృశ్యాలను అక్కడే ఉన్న వాహనాదారులు సెల్‌ ఫోన్లో రికార్డు చేశారు.

వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడు మహబూబ్‌ బాషాగా గుర్తించారు.. మృతుడు పటాన్‌చెరులో జరిగిన హర్షద్‌ హుస్సేన్‌ మర్డర్‌ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడని పోలీసులు తెలిపారు… పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story