మోదీ కేబినెట్‌.. కీలక శాఖలు వారికేనా..!

ముఖ్యంగా అత్యంత కీలకమైన, శక్తిమంతమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చోటుండే నాలుగు శాఖలు ఎవరికి కేటాయిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. హోం, రక్షణ, విదేశాంగ, ఆర్ధిక శాఖల మంత్రులకు సీసీఎస్ లో సభ్యులుగా ఉంటారు. గతంలో విదేశాంగ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన సుష్మా స్వరాజ్ కు ఈ సారి అవకాశం దక్కలేదు. ఆమె స్థానంలో విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జయశంకర్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. లేదంటే రవిశంకర్ ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన్ను కేబినెట్లోకి తీసుకున్నారు. ఇక ఆర్ధిక శాఖ మంత్రిగా అమిత్ షా కు అప్పగించే అవకాశాలున్నాయి. హోంమంత్రిగా మళ్లీ రాజ్ నాథ్ ఉంటారని తెలుస్తోంది. ఒకవేళ అమిత్ షా కోరుకుంటే ఆయనకు ఇచ్చే అవకాశం ఉంది. ఆర్ధిక శాఖ పీయుష్ గోయల్ కు ఇస్తారని తెలుస్తోంది. రక్షణ శాఖ నిర్మల సీతారామన్ కు మళ్లీ అప్పగించే అవకాశం ఉంది. ఒకవేళ హోంశాఖ అమిత్ షాకు ఇస్తే.. రాజ్ నాథ్ కు ఈ శాఖ ఇస్తారని తెలుస్తోంది.

చాలామంది మంత్రులకు పాత శాఖలే కొనసాగించే అవకాశం ఉంది. అరుణ్ జైట్ల, సుష్మా స్థానాల్లో అమిత్ షా, జైశంకర్ వస్తారని.. మిగలిన శాఖలు కొనసాగుతాయని కూడా పార్టీ వర్గాలంటున్నాయి. అర్జున్ ముండాకు గిరిజన సంక్షేమం దాదాపు ఖరారైంది. స్మృతి ఇరానీకి గతంలో ఇచ్చిన జౌళి శాఖ కాకుండా.. మేనకాగాంధీ గతంలో చేపట్టిన మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇస్తారని సమాచారం. పీయుష్ గోయల్, ధర్మేంద్రప్రధాన్ సహా అందరికీ పాత శాఖలే ఉంటాయని పీఎంఓ వర్గాలంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story