అమెరికాలో ప్రవాస భారతీయుడు ఆత్మహత్య

అమెరికాలో ప్రవాస భారతీయుడు ఆత్మహత్య
X

అమెరికాలో ఓ ప్రవాస భారతీయుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. 33 ఏళ్ల అర్నవ్ గుప్తా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో సజీవ దహనమయ్యాడు. అయితే ఇతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేరీ ల్యాండ్ కుచెందిన ఆర్నవ్ గుప్తా ఉదయం బయటకు వచ్చి ఎంతకు ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలోని ఎలిక్స్ పార్కుకు వచ్చిన ఆర్నవ్, అక్కడ అందరు చూస్తుండగానే తనకు తాను నిప్పంటించుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు… మృతికి గల కారణాలపై దర్యాప్తుచేస్తున్నారు.

Tags

Next Story