బిగ్‌బాస్3 లో శ్రీరెడ్డి..!!

బిగ్‌బాస్3 లో శ్రీరెడ్డి..!!

బుల్లి తెర ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన షో బిగ్ బాస్. సెలబ్రిటీలను తీసుకుంటే షో క్లిక్ అవుతుందని భావిస్తుంటారు నిర్వాహకులు. అంతకు ముందు శ్రీరెడ్డి అంటే అంతగా తెలియని తెలుగు ప్రేక్షకులకు.. క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో దేశమంతా తన పేరు మారుమ్రోగేలా చేసింది. సో.. ఇప్పుడు శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఇక ఆమెని హౌస్‌లోకి తీసుకువస్తే కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించవచ్చని తమిళ్ బిగ్ బాస్ భావించినట్టున్నారు. అందుకే ఆమెని సంప్రదించారు.

హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డిని సీజన్ 3లో కంటెస్టెంట్‌గా తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని, మూడో సీజన్‌కి ముస్తాబైంది. శ్రీరెడ్డి షోలో పాల్గొనే విషయమై చర్చలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story