ప్రపంచ కప్‌లో సచిన్

ప్రపంచ కప్‌లో సచిన్ ఏంటి..అతను ఎప్పుడో రిటైర్ అయ్యారుగా మళ్ళీ మైదానంలోకి అడుగు పెడుతున్నాడా! అని అనుకుంటారా? అలా అనుకుంటే పొరపాటే ప్రపంచకప్ 2019 టోర్నీ కోసం భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కామెంటేటర్‌గా మారాడు. గురువారం ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి కామెంట్రీలో సచిన్ సందడి చేశాడు. అయితే పలు సార్లు బీసీసీఐ, ఐసీసీ కామెంట్రీ కోసం అభ్యర్థించినా.. సచిన్ నో చెప్తూ వచ్చాడు. కానీ వరల్డ్‌కప్-2019కు మాత్రం కామెంట్రీ చేయడానికి ఒప్పుకున్నాడు.
2013లో రిటైర్మెంట్ ప్రకటించిన టెండూల్కర్ సుదీర్ఘకాలం పాటు భారత్ జట్టుకి సేవలందించారు. తన కేరీర్ మెుత్తంలో అరుసార్లు ప్రపంచకప్ ఆడాడు.
అన్ని ప్రపంచకప్‌ల్లో కలిపి 2,278 పరుగులు చేశాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగుల చేసిన ఘనత కూడా సచిన్‌దే. ఇంతవరకు ఎవరూ ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయలేదు.
తన 24 ఏళ్ల క్రికెట్ కేరీర్‌లో 34,357 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలలో కలిపి సచిన్ ఇప్పటివరకు 30వేలకు పైగా పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కరే మాత్రమే. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ కూడా టెండూల్కరే. మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వచ్చిన చర్చా కార్యక్రమంలోనూ సచిన్ పాల్గొన్నాడు. ఆ కార్యక్రమానికి ‘సచిన్ ఓపెన్స్ అగేన్’ అని పేరు పెట్టిందా ఆ ఛానెల్.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com