దారి మళ్ళిన కార్పొరేషన్ నిధులు.. నివ్వెరపోయిన సీఎం జగన్

ప్రత్యేక హోదా కోసం 15వ ఆర్ధిక సంఘం ముందు సమర్ధవంతంగా వాదనలను వినిపించాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం జగన్‌. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులు, సమస్యలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. శాఖవారీగా వరుస సమీక్షలో భాగంగా శనివారం ఆర్ధిక శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్‌.. సామాన్యుడిపై భారం పడకుండా రాష్ట్ర ఆర్ధిక స్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. హరిత పన్ను, వ్యర్ధ పదార్ధాలపై పన్నుతో పాటు ఎర్రచందనం అమ్మకంపై దృష్టి సారించాలన్నారు. అలాగే సరైన ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని దారి మళ్లించిన వైనంపై జగన్ నివ్వెరపోయారు.

ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఎక్సైజ్ శాఖ మీద ఆధారపడొద్దని అధికారులకు సూచించారు జగన్. ఎక్సైజ్ శాఖను ఆదాయవనరుగా చూడొద్దన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేవించారు. బెల్ట్ షాపులను సమూలంగా తొలగించాలని..ఎక్కడైనా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నట్లు దృష్టికి వస్తే…వారికి మద్యం సరఫరా చేసిన వైన్ షాప్ ల లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు.

Tags

Next Story