విజయవాడలో ఆన్‌లైన్‌ మోసాలు..

విజయవాడలో ఆన్‌లైన్‌ మోసాలు..

విజయవాడలో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామారావు అనే వ్యక్తి… ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు జమ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. బోగస్‌ ఎస్‌ఎంఎస్‌లో అమాయక జనాన్ని వల్లో వేసుకుని లక్షల రూపాయలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు రామారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో రెండు నెలల వ్యవధిలో 19 మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇతనిపై అనేక కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

Tags

Next Story