ఆమెను అలా పిలవడం మీకు ఇష్టం లేదా..!

ఆమెను అలా పిలవడం మీకు ఇష్టం లేదా..!

కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం పార్టీలోని పలువురు నేతలకు కీలక పదవులను కేటియించింది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్‌‌‌కు కేబినెట్‌లో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో ఆమెకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళగా కీలకమైన ఆర్ధిక శాఖను చేపట్టిన నిర్మలాసీతారామన్‌కు ఇతర పార్టీ నేతల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ' ఆర్థిక శాఖ బాధ్యతలు తీసుకున్న నిర్మలాసీతారామన్‌కు శుభాకాంక్షలు' అని జమ్మూకాశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి సో షల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. అదే విధంగా కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రమ్య(దివ్యా ) కూడా నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. '1970లో ఇందిరా గాంధీజీ ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టి మహిళలను గర్వపడేలా చేశారు. ఇప్పటి ప్రభుత్వంలో ఆ శాఖను చేపట్టినందుకు మీకు అభినందనలు.ప్రస్తుతం జీడీపీ అశించినంతంగా లేదు. మీరు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మీ వంతుగా కృషి​ చేస్తారని తెలుసు. మీకు మా సహకారం ఎప్పటికీ ఉంటుందని' రమ్య ట్వీట్‌ చేశారు.

అయితే రమ్య ట్విట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 'దేశ తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ను గుర్తించడం కాంగ్రెస్ వాళ్ళకు ఇష్టం లేనట్లు ఉంది.
ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉండి, ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వహించారు. కానీ మోదీ..నిర్మలాజీపై నమ్మకంతో ఆమెకు ఆ శాఖ బాధ్యతలు అప్పగించారు.
కావున తొలి ఆర్ధిక మహిళా మంత్రిగా ఆమెను గుర్తించాలి. మీరు ప్రస్తవించిన జీడీపీ అంటే 'గాంధీ డైనస్టీ పాలిటిక్స్‌' అనుకుంటా మీకు అసలు ఆ పదానికి వివరణ, అర్థం తెలియదు కదా అభినందన అనే భూచి చూపించి ఇలా రాజకీయాలు చేయడం, ప్రజలను పక్కదారి పట్టించడం సరైంది కాదు’ అంటూ నెటిజన్స్ రమ్యపై ట్రోల్‌ చేస్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story