పెళ్లింట డీజే.. సౌండ్ పెంచమన్నందుకు.. దారుణంగా..

పెళ్లింట డీజే.. సౌండ్ పెంచమన్నందుకు.. దారుణంగా..

పెళ్లింట డీజే రౌడీలు ఎంటరయ్యారు. కర్రలు, రాడ్లతో దొరికినవారిని దొరికినట్టు చితక్కొట్టారు. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో జరిగిందీ దారుణం. పచ్చని పందిరి.. రక్తంతో తడిసిపోయింది.

డీజే సౌండ్ పెంచమన్నందుకు గొడవ మొదలైంది. డీజే నిర్వాహకుడు తన స్నేహితులకు ఫోన్‌ చేశాడు. అల్లరి మూకల్ని రప్పించాడు. పెళ్లి రిసెప్షన్‌ జరుగుతుండగా ఎంటరైన వాళ్లు.. విచక్షణారహితంగా ప్రవర్తించారు. వరుడి కుటుంబాన్ని, వధువు బంధువులను వదల్లేదు. మాతో పెట్టుకుంటారా అంటూ చితకబాదారు. మండపాన్ని ధ్వంసం చేసిన అల్లరిమూకల ధాటికి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అతిథుల కోసం చేసిన వంటను సైతం నేలపాలు చేశారు. ఈ ఘటనపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story