ట్రంప్ మరో సంచలనం.. భారత్ కు జీఎస్పి..

ట్రంప్ మరో సంచలనం.. భారత్ కు జీఎస్పి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాణిజ్యపరంగా భారత్ కు ఉన్న ప్రాధాన్య వాణిజ్య హోదా GSP తొలగించేందుకు సిద్దమయ్యారు. జీఎస్పీ రద్దు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న ట్రంప్ … జూన్ 5నుంచి జీఎస్పీ హోదా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వైట్ హౌజ్ లో జరిగిన ఓ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయంలో అమెరికా ఇచ్చిన 60 రోజుల గడువు మే 3వ తేదీతో ముగుస్తుంది.

ఓ వైపు భారత్ తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామంటూనే ట్రంప్ జిఎస్పీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లలో సమానమైన, సమర్ధనీయమైన వాతావరణాన్ని కల్పించడంపై భారత్ నుంచి ఎటువంటి హామి లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ గతంలో కాంగ్రెస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అమెరికా వస్తువులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ట్రంప్ పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే జీఎస్పీ తొలగింపు వల్ల భారత్ ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story