ఆ ముగ్గురు మహిళా నేతలకు గవర్నర్ పదవులు

కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్‌ను సముచితంగా గౌరవించాలని పార్టీ నిర్ణయించింది. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందించిన సుష్మకు ఇటీవలి కాలంలో ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో ఆమెకు ఒత్తిడితో కూడిన మంత్రిపదవి అప్పగించలేదు. అయితే ఆమెను ఓ పెద్ద రాష్ట్రానికి గవర్నర్‌గా పంపాలని కేంద్రానికి బీజేపీ సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది.
సుష్మ స్వరాజ్‌తో పాటు… గత లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌తో పాటు.. మాజీ కేంద్రమంత్రి ఉమాభారతికి కూడా గవర్నర్ పదవులు ఇవ్వాలని సూచించనున్నట్లు సమాచారం. వయోభారం కారణంగా సుమిత్ర మహాజన్ ఈ సారి ఎన్నికల బరిలో దిగలేదు. అలాగే ఉమాభారతి సైతం ఆరోగ్య సమస్యల కారణంగా పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ప్రజాప్రతినిధ్యానికి దూరమైన ఈ ముగ్గురిని సముచితంగా గౌరవించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com