లోక్‌సభ సమావేశాలకు ముహూర్తం ఖరారు

లోక్‌సభ సమావేశాలకు ముహూర్తం ఖరారు

రెండోసారి అధికారాన్ని చేపట్టిన మోదీ ప్రభుత్వం… 17వ లోక్‌సభ సమావేశాలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు తొలి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ప్రారంభమైన మొదటి రోజున ప్రోటెం స్పీకర్‌ నియామకం జరుగుతుంది. ప్రోటెం స్పీకర్‌గా అత్యంత సీనియర్‌ అయిన మేనకాగాంధీ ఎంపికయ్యే అవకాశం ఉంది. తొలి రెండురోజులు సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారు. 19న లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 20న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆర్ధిక సర్వేను జూలై 4వ తేదీన విడుదల చేయనున్నారు.

ఎన్నికల ఏడాది కావడంతో.. ఫిబ్రవరిలో కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం…. 2019-20 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూలై 5న సభలో ప్రవేశపెట్టనుంది.

Next Story