మహేష్‌కి తల్లిగా విజయశాంతి..

మహేష్‌కి తల్లిగా విజయశాంతి..

సూపర్ స్టార్ మహేష్ నటించిన 25వ సినిమా మహర్షి రీసెంట్ గా రిలీజై ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా కాంప్లిమెంట్స్ కూడా అందించింది మహర్షి. ఆ జోష్ లో ఉన్న ప్రిన్స్, తన 26వ సినిమాని పట్టాలెక్కించాడు. దిల్ రాజు, అనిల్ సుంకర కలసి నిర్మించే ఈ సినిమాకి దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాకి 'సరిలేరు నీకెవ్వరూ' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ కి మంచి అప్లాజ్ వస్తోంది.

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, మహేష్ బాబు కోసం మంచి స్టోరీ రెడీ చేశాడు. ఇందులో మహేష్ సోల్జర్ గా కనిపించబోతున్నాడు. ఆర్మీ నుంచి సిటీకి వచ్చిన ఓ వ్యక్తి జీవితంలో జరిగిన కథగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో మహేష్ బాబుకి జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక నటిస్తుంటే, మహేష్ కి తల్లిగా ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. జూన్ లోనే షూటింగ్ మొదలుపెట్టి, వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story