కేసీఆర్‌ లొంగేది ఒక్క బీజేపీకి మాత్రమే : జీవన్‌ రెడ్డి

కేసీఆర్‌ లొంగేది ఒక్క బీజేపీకి మాత్రమే : జీవన్‌ రెడ్డి

కేసీఆర్‌ లొంగేది ఒక్క బీజేపీకి మాత్రమేనంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత MLC జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. TRT క్వాలిఫైడ్‌ అభ్యర్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఇందిరాపార్కు దగ్గర ఆందోళనకు దిగిన అభ్యర్థులకు జీవన్‌ రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మద్దతు పలికారు. ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ను కూడా సరిగా పూర్తి చేయలేని ప్రభుత్వం అంటూ లక్ష్మణ్‌ TRS సర్కారుపై మండిపడ్డారు. అటు జీవన్‌ రెడ్డి సైతం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్‌ను దారికి తేవడం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని.. వారికి తాము అండగా నిలుస్తామని జీవన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story