ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా..

ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా..

జనగామ జిల్లాలో ఈత సరదా ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. జిల్లాలోని నర్మెట్ట మండలం బొమ్మకూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన లకావత్ సుమలత, లకావత్ సంగీత, అవినాష్ బొమ్మకూర్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు. సరదాగా నీటిలోకి దిగారు. ఒక్కసారిగా లోతులోకి వెళ్లటంతో ముగ్గురు మృతి చెందారు.

రిజర్వాయర్ లో కేరింతలు కొడుతున్న సరదా క్షణాలను బంధువుల్లో మరొకరు వీడియో తీస్తున్నారు. లోతు కూడా పెద్దగా లేదు. కానీ, ఆ సరదా క్షాణాలు ఒక్కసారిగా విషాందంతంగా మారాయి. కాలువలో ఉన్న గుంతల కారణంగానే ముగ్గురు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ప్రమాదాన్ని పసిగట్టేలోపే ముగ్గురు నీటిలో మునిగిపోయారు.

బొమ్మకూర్ రిజర్వాయ్ డేత్ రిజర్వాయర్ గా మారుతోంది. గతంలోనూ రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. రిజర్వాయర్ లో మట్టి తరలింపు కారణంగా ఏర్పడిన గుంతల కారణంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు స్థానికులు.

Tags

Read MoreRead Less
Next Story