మైదానంలో మాయ చేసే అందం..చిన్న స్కర్టుతో..

మైదానంలో మాయ చేసే అందం..చిన్న స్కర్టుతో..

టీవీలో ప్రసారమయే ఏ కార్యక్రమానికి ఆయన సెంటర్ అఫ్ అట్రాక్షన్‌ యాంకరే. పోగ్రాం చూసే ప్రేక్షకుల దృష్టి ముందుగా వచ్చే యాంకర్‌పైనే ఉంటుంది.. కొందరు మాటలతో ఆకట్టుకుంటే.. మరికొందరు. రూపంతో ఆకర్షిస్తారు. అలా అందంతో ,మాటలతో ప్రేక్షకులను ఆకట్టి పడేస్తుంది ఓ భామ. దేశంలో మోస్ట్ ఫేవరేబుల్ వ్యాఖ్వతగా క్రికెట్,పుట్‌బాల్ అబిమానులకు తెగ నచ్చేసింది ఆ యంగ్ ఆండ్ డైనామిక్ యాంకర్. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ఆ పేరు మయంతి లాంగర్‌. ఐపీఎల్‌లో బెస్ట్ ఛాయస్ యాకంర్‌గా తనదైన ముద్ర వేసుకుంది ఈ మగువ. మ్యాచ్‌కి ముందు జరిగే విశ్లేషణలను చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ మయంతి లాంగర్ కోసమే చూస్తారంటే..ఆమె క్రేజీ యూత్‌లో ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్‌ ప్రపంచకప్‌లోను ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది

ఈఎస్‌పీఎన్‌ స్టార్‌స్పోర్ట్స్‌ చానల్లో ప్రసారమైన 2010 ఫిఫా ప్రపంచకప్‌కి తొలిసారి మయంతి వ్యాఖ్యతగా వ్వవహరించింది. ముద్దుగా, బొద్దుగా చూడాగానే ఆకట్టుకునే రూపంతో కనిపించి ఆమె.. టీవీలో గలాగలా మాట్లాడుతుంటే అభిమానులకు ఊపిరాడలేదు. ఫిఫా ప్రపంచకప్‌ ప్రజేంటర్‌గా తన పెర్ ఫార్మెన్స్ చాలా మందికి నచ్చడంతో ఆమె కేరిర్ తారా జువ్వులా దూసుకుపోయింది. అప్పటి నుంచి అన్ని స్పోర్ట్స్ ఫార్మట్స్‌కి యాకరింగ్‌గా వ్యవహరిస్తూ వస్తుంది. ఐపీఎల్ ఎంట్రీతో క్రికెట్ అబిమానులకు మరింతగా దగ్గరైంది. మహిళా టీవీ ప్రెజెంటర్లు చాలా మంది ఉన్న.. ఆటపై మయంతికి ఉన్న అవగాహాన అందర్నీ ఆకర్షించాయి. అలాగే 2010 దిల్లీ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్‌ క్రీడలకూ టీవీ ప్రెజెంటర్‌గా చేసింది. ముఖ్యంగా ఐపీఎల్‌.. 2011, 2015 క్రికెట్‌ ప్రపంచకప్‌లలో వచ్చిన మయంతి అప్పటినుంచి కంటిన్యూగా ఐపీఎల్‌లో వ్యాఖ్యతగా కొనసాగుతుంది.

క్రికెటర్ స్టువర్ట్‌ బిన్నీని మయంతి 2013లో పెళ్లి చేసుకున్నారు. ఎదుగుతున్నవారికి అంటకాలు విమర్శలు సహజం కనుక.. అలానే మయంతి కూడా చాలా విమర్శలు ఎదుర్కొంది. ఆమెకు నెటిజెన్స్‌ నుంచి విపరీతమైన ట్రోలింగ్‌ మొదలయ్యాయి. ఆమె వస్త్ర ధారణపై విమర్శలు గుప్పించారు. ఒక టీ షర్టు.. దానిపై ఒక చిన్న స్కర్టు.. ఆపై ఐదంగుళాల హీల్స్‌! ఈ వస్త్రధారణే ఆమెపై ట్రోలింగ్స్‌కు కారణమయ్యాయి. భర్త బిన్నీ ఫామ్‌లో లేనప్పుడల్లా అభిమానులు ఆమెనే టార్గెట్ చేసేవారు. కానీ మయంతి వాటిని పట్టించుకోలేదు. తన భర్త పేరుతో ట్రోల్ చేస్తున్నవారికి ఎదురు సమాధానంతో బుద్ది చేప్పింది. 'నేను మీలా పనికి రాని ట్వీట్లు చేయకుండా పద్దెమిదేళ్లకే ఒక ఉద్యోగంలో చేరాను'.. అంటూ విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story