పోలీస్‌ పెట్రోల్ వాహనంలో నలుగురు యువకుల హల్‌చల్‌

పోలీస్‌ పెట్రోల్ వాహనంలో నలుగురు యువకుల హల్‌చల్‌

పోలీస్‌ పెట్రోల్ వాహనంలో నలుగురు యువకులు హల్‌చల్‌ చేశారు. హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లో సైరన్‌ వేసుకుంటూ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశారు. దీంతో మిగతా వాహనదారులు ఉలిక్కిపడ్డారు. లా అండ్‌ ఆర్డర్‌ కోసం వినియోగించే పోలీస్‌ వాహనం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి.

వాహనాన్ని నడిపింది మైనర్లుగా చెబుతున్నారు. పోలీస్‌ వాహనం ఎవరికి సంబంధించింది. ఆ యువకుల చేతికి పెట్రోలింగ్‌ వాహనం ఎలా వెళ్లింది అన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రూల్స్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story