బిగ్ బాస్ సీజన్ త్రీ లో కంటెస్టెంట్స్ వీరే?

బిగ్ బాస్ సీజన్ త్రీ లో కంటెస్టెంట్స్ వీరే?

బుల్లి తెరపై బడా రియాల్టి షో బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. కోట్లాది అభిమానులున్న ఈ బంపర్‌ ప్రోగాం.. హౌజ్ లోకి ఎంటరవటమే మంచి ఛాన్స్ గా భావిస్తారు. ఇక షోను లీడ్ చేసే హోస్ట్ రోల్ ఎప్పుడూ ప్రత్యేకమే. బిగ్ బాస్ సీజన్ వన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అందరిని మెప్పించాడు. మొదట్లో బిగ్ బాస్ జనంలోకి వెళ్లేందుకు కొద్ది సమయం పట్టినా..ఆ తర్వాత రియాల్టి షోలో కిక్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో షోని మరింత రక్తి కట్టించాడు. ఆ తర్వాతి సీజన్ కు హీరో నాని బిగ్ బాస్ కి హోస్ట్ గా సెలక్ట్ చేశారు. ప్రారంభంలో కొద్దిగా నిరాశ పరిచినా..ఆ తర్వాత నేచురల్ స్టార్ రియాల్టి షోను బాగానే ప్రజెంట్ చేశాడు.

బిగ్ బాస్ మొదటి సీజన్ 70 రోజులు ప్లాన్ చేశారు. 16 మంది హౌజ్ మేట్స్ తో ప్రారంభమైన షో.. ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తించటంతో సక్సెస్ అయింది. హౌజ్ మేట్స్ మధ్య వివాదాలు, ఎలిమేషన్ రౌండ్లు ఆడియన్స్ లో ఉత్కంఠతను పెంచాయి. సెకండ్ సీజన్ లో హౌజ్ లో ఉండాల్సిన గడువు 112 రోజులకు పెరిగింది. కంటెస్టెంట్ల సంఖ్యను కూడా 18కి పెంచారు. సీజన్ వన్ తో పోలిస్తే సీజన్ టూ ఎక్కువ వివాదాలకు కేంద్రంగా మారింది. విన్నర్ కౌశల్‌కు హౌజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా వివాదాలు వెంటాడాయి.

ఇక ఇప్పుడు మూడో సీజన్ సమయం ఆసన్నమైంది. తొలి రెండు సీజన్లను బీట్ చేసేలా మూడో సీజన్ కు ప్రీపేర్ అవుతోంది. హోస్ట్ కోసం పెద్ద కసరత్తే చేసింది బిగ్ బాస్ టీం. మొదటి రెండు సీజన్లకు మించి ఉండేలా టాలీవుడ్ పెద్ద హీరోతో రియాల్టి షోను డిజైన్ చేసుకుంది. అతనే బిగ్ స్క్రీన్ రోమాంటిక్ హీరో నాగార్జున. టాలీవుడ్ మన్మధుడిగా అతనికి ఉండే క్రేజ్ బిగ్ బాస్ కు మరింత మైలేజ్ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి.

కంటెస్టెంట్ల విషయంలో ఈ సారి ప్రత్యేకత చాటుకుంటోంది బిగ్ బాస్ టీం. టీవీ షో, యూట్యూబ్, ఫిల్మ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ ఇలా వివిధ రంగాల నుంచి పోటీదారులను ఎంపిక చేసుకుంటోంది. నటి గాయత్రి గుప్తా, యాంకర్ సావిత్రి, మోడల్ సింధూర గద్దె, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల, ఉదయభానుతో షోకి గ్లామర్ టచ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇంట్రస్టింగ్ కంటెస్ట్ లుగా యూట్యూబ్ స్టార్ మహాతల్లి, జబర్దస్త్ ఫేం పొట్టి నరేష్ ను అప్రోచ్ అయ్యిందట. సీజన్ టూలో సింగర్ గీతా మాధురిని హౌజ్ లోకి తీసుకెళ్లిన బిగ్ బాస్ టీం.. ఈ సారి హేమచంద్రకు అవకాశం కల్పిస్తున్నట్లు టాక్‌. డ్యాన్స్ మాస్టర్ రఘు కూడా హౌజ్ లోకి ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది. టీవీ సీరియల్స్ తో ఫేం అయిన జాకీ, నటుడు కమల్ కామరాజ్ కూడా బిగ్ బాస్ త్రీలో చాన్స్ కొట్టేశారని సమాచారం. బిగ్ బాస్ త్రీని బిగ్ గా చూపించాలని అనుకుంటున్న టీం.. సర్ ప్రైజ్ విజిటర్స్ విషయంలోనూ విలక్షణంగానే నిర్ణయాలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ సారి సర్ ప్రైజ్ స్టార్స్ గా హౌజ్ లోకి రేణు దేశాయ్ ని తీసుకురాబోతున్నారట. అలాగే ఏపీ ఎలక్షన్స్ యూ ట్యూబ్ పొలిటికల్ స్టార్ గా కామెడి పండించిన కేఏ పాల్ కూడా సర్ ప్రైజ్ స్టార్ గా ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story