టాలీవుడ్ బిగ్ హీరోతో బిగ్ బాస్.. సర్ ప్రైజ్ స్టార్‌గా కేఏ పాల్

టాలీవుడ్ బిగ్ హీరోతో బిగ్ బాస్.. సర్ ప్రైజ్ స్టార్‌గా కేఏ పాల్

స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ ప్రొగ్రామ్ బిగ్ బాస్. తొలి రెండు సీజన్స్ లో దుమ్మురేపిన ఈ షో మళ్లీ వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఫస్ట్ సీజన్ లో ఎన్టీఆర్, సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ లుగా వ్యవహరించారు. ఇక టాలీవుడ్ బిగ్ హీరోతో బిగ్ బాస్.. థర్డ్ సీజన్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. ఇక ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారన్న దానిపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తొలి రెండు సీజన్లను బీట్ చేసేలా మూడో సీజన్ కు ప్రీపేర్ అవుతోంది. హోస్ట్ కోసం పెద్ద కసరత్తే చేసింది బిగ్ బాస్ టీం. మొదటి రెండు సీజన్లకు మించి ఉండేలా టాలీవుడ్ పెద్ద హీరోతో రియాల్టి షోను డిజైన్ చేసుకుంది. అతనే బిగ్ స్క్రీన్ రోమాంటిక్ హీరో నాగార్జున.

చిన్న స్క్రీన్ పెద్ద షో బిగ్ బాస్ కు హోస్ట్ గా ఉండేందుకు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో ఎన్టీఆర్, నాని తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. టాలీవుడ్ మన్మధుడిగా అతనికి ఉండే క్రేజ్ బిగ్ బాస్ కు మరింత మైలేజ్ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి.

బిగ్ బాస్ త్రీని బిగ్ గా చూపించాలని అనుకుంటున్న టీం.. సర్ ప్రైజ్ విజిటర్స్ విషయంలోనూ విలక్షణంగానే నిర్ణయాలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ సారి సర్ ప్రైజ్ స్టార్స్ గా హౌజ్ లోకి రేణు దేశాయ్ ని తీసుకురాబోతున్నారట. హీరోయిన్ గా, టీవీ షోలకు జడ్జిగా చేసిన రేణు దేశాయ్.. సర్ ప్రైజ్ స్టార్ గా కనిపించేందుకు ఓకే కూడా చెప్పారని సమాచారం. అలాగే ఏపీ ఎలక్షన్స్ యూ ట్యూబ్ పొలిటికల్ స్టార్ గా కామెడి పండించిన కేఏ పాల్ కూడా సర్ ప్రైజ్ స్టార్ గా ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story