ఆర్టీసీ బస్సును ఆపి.. డ్రైవర్‌ను చితకబాదిన..

విజయవాడ భవానిపురంలో అర్థరాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయారు. టిఎస్‌ఆర్‌టిసి బస్‌ను నిలిపి ఆవేశంతో డ్రైవర్‌పై దాడి చేశారు. బస్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకులు మాత్రం డ్రైవర్‌దే తప్పని ఆరోపిస్తున్నారు. తమను ఢీ కొట్టడమే కాకుండా.. బాస్ ఆపకుండా వెళ్లాడని.. అందుకే బస్‌ను ఓవర్‌టేక్ చేసి నిలదీశమంటున్నారు.
బెజవాడలో అర్ధరాత్రి అల్లరి మూకలు భీభత్సం సృష్టించాయి. తాము వెళ్తున్న బైక్‌కు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సును యువకులు ఆపి మరీ.. డ్రైవర్‌ను చితకబాదారు. అనంతరం బస్సులో చొరబడి డాడి చేసి.. 25 వేలు తీసుకెళ్లారు. యువకుల బీభత్సంతో భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు.. వాళ్లను అడ్డుకునేందుకు కూడా భయపడి మిన్నకుండిపోయారు. మొత్తం 20 మంది యువకులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సు ముందుభాగంలోని అద్దాలను సైతం ధ్వంసం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com