జగన్ క్యాబినెట్ లో మంత్రులు వీరేనా..?

జగన్ క్యాబినెట్ లో మంత్రులు వీరేనా..?

జగన్ మంత్రివర్గం జూన్ 8న ఏర్పాటు కాబోతోంది. డేట్ ఫిక్స్ కావడంతో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు బిజీ అయ్యారు. అందరి అభ్యర్థనలు ఆలకిస్తున్న సీఎం.. హామీ మాత్రం ఇవ్వడం లేదు. అభ్యర్ధిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో కొన్నిచోట్ల బహిరంగ హామీలు ఇచ్చారు జగన్. వైసీపీ తరఫున 151 మంది గెలిచారు. కొన్ని జిల్లాలు క్లీన్‌ స్వీప్‌ అయ్యాయి. పార్టీ పెట్టిన 9ఏళ్ల పోరాటం తర్వాత అధికారంలోకి రావడంతో పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది.

వివిధ సందర్భాల్లో జగన్ ఇచ్చిన హామీల మేరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ఓడించడం ఒక ఎత్తయితే.. రాజధాని కేంద్రంగా ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేశారాయన. పలు కేసులు వేసి టీడీపీ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేయడం కలిసొస్తున్న అంశం. ఇదే జిల్లా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్‌కూ గతంలో హామీ ఇచ్చారు జగన్. ఆర్థికంగా పరిపుష్టి కలిగిన విడదల రజనీ కోసం టికెట్ త్యాగం చేస్తే.. మండలికి పంపి మంత్రిని చేస్తానని చెప్పారు. గుంటూరు జిల్లాలో బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడం మర్రి రాజశేఖర్‌కు ప్లస్. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి కూడా రేసులో ఉన్నారు.

ఇక, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి సైతం మంత్రి పదవి ఇస్తానంటూ ప్రచారంలోహామీ ఇచ్చారు జగన్.

ఇకమంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి ఉన్నారు విజయనగరం జిల్లా నుంచి చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ., కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరలు ఉన్నారు. విశాఖలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్, పాయకారావుపేట గొర్లె బాబురావు,భీమిలీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావులు రేసులో ఉన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణలు., కుల సమీకరణలలో భాగంగా ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది పార్టీ అధినేత అభీష్టం కానుంది.

తూర్పు గోదావరిలో ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఉన్నారు. పశ్చిమ గోదావరిలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని, కొవ్వూరు ఎమ్మెల్యే తావేటి వనిత, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. కృష్ణాజిల్లాలో బందరు ఎమ్మెల్యే పేర్నినాని, జగ్గయ్యపేట ఎమ్మెల్య ఉదయభాను, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీలో ఉన్నారు. ఉభయ గోదావరి., కృష్ణా, గుంటూరు, జిల్లాలలో కమ్మ, కాపు సామాజిక సమీకరణలతో పాటు ఎస్సీ సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యత లభించవచ్చు.

ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ లు పోటీలో ఉన్నారు. నెల్లూరులో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతం రెడ్డి., కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పోటీ ఉన్నారు. చిత్తూరులో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి., తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా కు మంత్రి పదవి దక్కొచ్చు. కడపలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్ భాషా., కర్నూలు డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డి, రాయగదుర్గం కాపు రామచంద్రారెడ్డి, పెనుగొండ శంకర్ నారాయణల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద వైసీపీలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా ఎక్కువగానే ఉండటంతో జగన్ ఎవరివైపు మొగ్గు చూపుతారనేది కీలకంగా మారింది.

ఒకేసారి పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేస్తారా., తొలుత కొద్దిమందికి అవకాశం ఇచ్చి.. తర్వాత విస్తరణ ఉంటుందా అనేది స్పష్టత లేదు. అయితే పదవులు ఆశిస్తున్న వారి జాబితా భారీగానే ఉంది. ఆశిస్తున్న వారి జాబితా భారీగానే ఉంది.

Tags

Next Story