ఉద్యోగులకు తీపి కబురు అందించిన కేసీఆర్ ప్రభుత్వం

ఉద్యోగులకు  తీపి కబురు అందించిన కేసీఆర్ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం డీఏ పెరగనుంది. పెరిగిన డీఏ 2018 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

మరోవైపు 2019-20 సంవత్సరానికి రైతుబంధు పథకం కొనసాగింపు కోసం మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుబంధు కింద ఎకరాకు పెట్టుబ‌డి సాయం ఒక ద‌ఫా 4 వేల నుంచి 5 వేలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతుబంధు అమలుకు రాష్ట్రస్థాయి పరిశీలన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

పథకం అమలుకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలించనుంది. 30 రోజుల్లోపు సమస్య పరిష్కారం అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.మొత్తం రైతుబంధు లబ్ధిదారులు 54 లక్షల 50 వేల మంది. ఈసారి ఆర్బీఐ ప్లాట్‌ఫాం ఈక్యుబర్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో రైతుల అకౌంట్లలోకి డబ్బులను బదిలీ చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story