వన్‌సైడ్‌గా ముగుస్తున్న వరల్డ్‌ కప్‌ వార్‌లు

వన్‌సైడ్‌గా ముగుస్తున్న వరల్డ్‌ కప్‌ వార్‌లు

వరల్డ్‌ కప్‌ వార్‌లు వన్‌సైడ్‌గా ముగుస్తున్నాయి.. శనివారం సోఫియా గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో.. న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. మొదట టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా చేతులు ఎత్తేశారు. పిచ్ బౌలింగ్‌కి పూర్తిస్థాయిలో అనుకూలించడంతో కివీస్ పేసర్లు చెలరేగిపోయారు. లంక బ్యాటింగ్‌లో కరుణరత్నే 52, కుషల్ పెరీరా 29, తిషారా పెరీరా 27 మినహా మిగితా వారందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో శ్రీలంక 29.2 ఓవర్లలో 136 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

లక్ష్య చేధన ప్రారంభించిన కివీస్ వికెట్ కోల్పోకుండానే విజయం సాధించింది. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ 73, కొలిన్ మున్రో 58 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 137 పరుగులు చేసి.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన కివీస్ బౌలర్ మాట్ హెర్నీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Tags

Next Story