టపాసుగా భావించి నాటు బాంబుకు నిప్పు పెట్టిన చిన్నారులు..

X
By - TV5 Telugu |2 Jun 2019 8:31 PM IST
గుంటూరు జిల్లాలో నాటు బాంబు పేలి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న ఇద్దరు అబ్బాయిలకు బాంబు కనిపించింది. టపాసుగా భావించిన వారు దానికి నిప్పు పెట్టారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. చిన్నారుల కడుపులోకి గాజుపెంకులు దూసుకెళ్లటంతో గాయాలయ్యాయి. చిన్నారులు ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com