శుభకార్యానికి వెళ్లి.. తల్లికొడుకుతో పాటు ఓ వృద్ధురాలు..

శుభకార్యానికి వెళ్లి.. తల్లికొడుకుతో పాటు ఓ వృద్ధురాలు..

జగద్గిరిగుట్ట మండలంలో దారుణం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో పడి తల్లి కొడుకులతో పాటు ఓ వృద్ధురాలు మృతి చెందారు. గాజులరామారం బాలయ్యనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు అనిత, ఆమె కొడుకు యశ్వంత్ గా గుర్తించారు. మహాబూబ్ నగర్ నారాయణపేటకు చెందినవారీగా చెబుతున్నారు. అమ్మయ్య అనే వృద్ధురాలిది కర్ణాటకలోని యాదగిరి జిల్లాగా చెబుతున్నారు. బాలయ్యనగర్ లో ఓ శుభకార్యానికి హజరైన ఈ ముగ్గురు ఉదయం 10 గంటల ప్రాంతంలో క్వారీ గుంతలో పడ్డారు. కాపాడేందుకు ప్రయత్నం చేసినా..లాభం లేకుండా పోయింది.

Tags

Read MoreRead Less
Next Story