కొడుకును ఉరేసిన తండ్రి..అది చూసి తల్లి కూడా..

అప్పుల వాళ్ళ వేధింపులు భరించలేక ఓ కుటుంబం మూకుమ్మడి బలవన్మరణానికి సిద్దమైంది. ముందుగా కుటుంబ సభ్యులను హత్య చేసి తర్వాత తను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు ఆ తండ్రి. తొలుత అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకును బలవంతంగా చంపేశాడు. అతని,భార్య కూతురు వద్దంటున్నా వినకుండా దారుణంగా ఊరి తీసి చంపాడు. ఈ సంఘటన బెంగుళూరులోని విబూతినగర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సురేశ్‌బాబు, గీతాభాయి అనే దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి విభూతిపుర ఎస్‌ఎల్‌ఎన్ స్కూల్ వద్ద నివాసం ఉంటున్నారు. సురేశ్‌బాబు ట్రావెల్స్ ఏజెన్సీని నడుపుతుండగా , అతని భార్య గీతాబాయి ఇంటి వద్ద కిరాణా దుకాణం నిర్వహిస్తుండడంతో పాటుగా చీటీలను నడిపేది. అయితే చీటీల వ్యాపారంలో బాగా నష్టం రావడంతో చీటీలు వేసిన వ్యక్తులు తమకు డబ్బు చేల్లించాలంటూ గీతాబాయిపై ఒత్తిడి తీసుకువచ్చారు.
వారి ఒత్తిళ్ళను భరించలేని ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ముందుగా సురేశ్‌బాబు 12 ఏళ్ల కుమారుడికి ఊరేసి చంపాడు. అయితే కొడుకును భర్త చంపుతుండగా భార్య వీడియో తీసింది. కొడుకు మరణం తట్టుకులేని ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. కానీ సురేశ్ అతని కూతురు మాత్రం ఆత్మహత్యకు పాల్పడలేదు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహలను పోస్ట్‌మార్టంకు తరలించారు. కేసు విచారణలో భాగంగా సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత తన భార్యే కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. తాను కూడా బలవన్మరణానికి సిద్దం కాగా తన కూతురు అడ్డకుందని సురేశ్ పోలీసులకు తెలిపాడు. కూతురు అసలు విషయం వారికి చేప్పడంతో సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యతో పాటు.. ఆత్మహత్యాయత్నానికి సంబంధించి పలు సెక్షన్‌ల కింద కేసులు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com