సియాచిన్ గ్లేసియర్‌ను సందర్శించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్

సియాచిన్ గ్లేసియర్‌ను సందర్శించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ సియాచిన్ గ్లేసియర్‌ను సందర్శించనున్నారు. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు భారత సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్‌తో కలిసి రాజ్‌నాథ్ వెళ్తారు. సియాచిన్ మంచు పర్వతాల్లో భారత దేశ భూభాగానికి రక్షణ కల్పిస్తున్న సైనికులు, అధికారులను రాజ్‌నాథ్ సింగ్ కలుస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

ప్రపంచంలోనే ఎత్తయిన యుధ్ధక్షేత్రంగా సియాచిన్‌కు పేరుంది. 12 వేల అడుగుల నుంచి 23 వేల అడుగుల ఎత్తులో భారత్ బేస్ క్యాంప్స్ ఉంటాయి. శీతాకాలంలో ఇక్కడ మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సైనికులు ఇక్కడ కాపలా కాస్తూ ఉంటారు. 2014 లో మొదటి సారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాన మంత్రి మోదీ కూడా సియాచిన్ గ్లేసియర్‌లో పర్యటించారు.

Tags

Read MoreRead Less
Next Story