ఆంధ్రప్రదేశ్

ఓ చిన్న నిర్లక్ష్యం..ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమైంది

ఓ చిన్న నిర్లక్ష్యం..ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమైంది
X

విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో విద్యుత్ స్థంబాన్ని ఆటో ఢీకొన్న ఘటనలో ఐదుగురు సజీవదహనం అవగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. కేజీహెచ్‌ బర్నింగ్‌ ఐసీయూ వార్డులో వారికి చికిత్స అందిస్తున్నారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప ఏడాదిన్నార వయస్సున్న జె.వికాస్, నాలుగేళ్ల వి.దావీదు, ఐదేళ్ల జెన్నిబాబుల పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. వికాస్ తండ్రి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా పొరుగింటివారు ఆబాలుడ్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల పరిస్థితి విషయంగా ఉండడంతో బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు

కేజీహెచ్‌లో చికిత్స పొందుతోన్న చిన్నారులను పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ పరామర్శించారు. వారి ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎంతఖర్చయినా పిల్లల ప్రాణాలు కాపాడాలంటూ వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

నర్సీపట్నం ఏరియా ఆసుప్రతిలో చికిత్సపొందుతున్న బాధితులను జిల్లా కలెకర్ట్‌ బాస్కర్ , నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అదించాలని డాక్టర్లకు చూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

ఈప్రమాద ఘటనలో ఆటో డ్రైవర్‌ కృష్ణారావు, చెరువూరు చెందిన గంగరాజు, లోత బొంజిబాబు, ప్రసాద్ అక్కడిక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన చిట్టిబాబు ఆసుపత్రి తరలిస్తుండగా చనిపోయాడు. మృతుల కుటుంబసభ్యుల, బంధువుల రోదనలతో హృదయ విదాకరంగా మారాయి. మృతులంతా.. చెరువూరు చీకుపనస, సబ్బంపల్లి గ్రామాలకు చెందినవారు. బాధితకుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం ప్రకటించింది.

Next Story

RELATED STORIES