క్రికెట్ ప్రపంచకప్‌లో సంచలనం..
క్రికెట్ ప్రపంచకప్ లో సంచలనం నమోదైంది. బంగ్లాదేశ్ బెబ్బులిలా రెచ్చిపోయింది. ఏకంగా వరల్డ్ కప్ లో అత్యధిక స్కోర్ సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన బంగ్లా.. ప్రత్యర్థి అత్యుత్తమ పేస్ బలగాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ రికార్డుల మోత మోగించింది. సమిష్టిగా రాణించి దక్షి ణాఫ్రికాను చిత్తు చేసింది. వెటరన్ బ్యాట్స్‌మెన్ షకీబల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో కదం తొక్కగా… తమ వన్డే చరిత్రలోనే బంగ్లా భారీ స్కోరు సాధించింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగులు చేసింది. పెహ్లుక్వాయో, మోరిస్, తాహిర్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
ఇక ప్రపంచక్‌పలో రికార్డు ఛేదన కోసం బరిలోకి దిగిన సఫారీలు ఒత్తిడిని తట్టుకోలేక వరుసగా రెండో ఓటమి చవిచూశారు. కట్టుదిట్టమైన బంగ్లా బౌలర్ల ధాటికి వేగంగా పరుగులు తీయలేకపోయారు. డుప్లెసిస్ మాత్రం అర్ధసెంచరీతో సత్తా చాటినా ఇతరులు భారీ స్కోర్లు చేయలేక పోయారు. 50 ఓవర్లలో 8 వికెట్లకు 309 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తమీమ్ , సౌమ్య సర్కార్ శుభారంభం ఇవ్వగా మిడిలార్డర్‌లో షకీబల్, ముష్ఫికర్ జట్టుకు రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత చివర్లో మహ్ముదుల్లా ధాటిని కొనసాగించగా జట్టు స్కోరు 300 దాటింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 309 పరుగులు మాత్రమే చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com