సైకో శ్రీనివాసరెడ్డి కేసులో మరో ట్విస్ట్..ఫోన్‌లో..

సైకో కిల్లర్ వరుస హత్యలు చేశాడు. పసివాళ్ల ఉసురుతీశాడు. రాక్షసుడికంటే అత్యంత కిరాతకుడు. ఆ దుర్మార్గుడి ఆగడాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. అమ్మాయిలను చంపి అడ్రస్ లేకుండా చేయాలనుకున్నాడు. వాళ్ల అడెంటిటీ దొరకకుండా కుంటల్లో పడేశాడు. కానీ నిజం నిప్పులాంటిది. వాటిని పోలీసులు తవ్వితీస్తున్నారు. మరి శ్రీనివాస్ తీసుకొచ్చిన ఒక జంట ఏమైంది?
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కిరాతకాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. ముగ్గురు విద్యార్థులను అత్యంత దారుణంగా పొట్టనపెట్టుకున్నాడు. వాళ్ల ఆచూకీ పేరెంట్స్‌కిగానీ, పోలీసులకుగానీ దొరకకుండా మాయం చేయాలనుకున్నాడు. కానీ శనివారం మూడు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్న పోలీసులు…అతడి నుంచి ఈ మరిన్ని నిజాలు కక్కించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో శ్రీనివాస్ రెడ్డిని తిప్పిన పోలీసులు… అతడు ఇచ్చిన సమాచారంతో నాలుగు గంటలపాటు వెదకితే… మనీషా, కల్పనల ఆధార్ కార్డులు, స్కూల్ ఐడీ కార్డులు దొరికాయి. అయితే మనీషా సెల్ ఫోన్ మాత్రం ఇంకా దొరకలేదు…
శ్రీనివాస్ రెడ్డి ఓ నరరూప రాక్షసుడు. నాలుగేళ్ల క్రితం హాజీపూర్ నుంచి మైసిరెడ్డిపల్లికి వెళ్తున్న తుంగని కల్పనపై అటాక్ చేశాడు. ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఈ నీచుడు… ఆ బాలిక డెడ్‌బాడీని గన్నీ బ్యాగులో కుక్కి మర్రి బావిలో పడేశాడు. కల్పన స్కూల్ యూనిఫాం, టిఫిన్ బాక్స్‌నూ బావిలోకి పడేశాడు. ఆమె స్కూల్ ఐడీ కార్డును చెట్ల పొదల్లోకి విసిరేశాడు. ఆ తర్వాత మనీషాను టార్గెట్ చేసిన ఈ కిరాతకుడు ఆమెను కూడా మర్రి బావి దగ్గరికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను చంపి మృతదేమాన్ని బావిలో పూడ్చిపెట్టేశాడు. మనీషా అడ్రస్ ఎవరికీ దొరకకుండా ఆధార్ కార్డు, సెల్‌ఫోన్‌లను పోలీస్ స్టేషన్ పక్కనే దగ్గరున్న కర్కలమ్మ కుంటలో పడేశాడు..
వెలుగు చూడని సైకో శ్రీనివాస్ రెడ్డి దారుణాలు ఇంకా ఉన్నట్లు హాజీపూర్ వాసులు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నుంచి తీసుకొచ్చిన జంట ఆచూకీ లేనట్లు తెలుస్తోంది. తమ ప్రాంతంలో మామిడి తోటలు చాలా ఉన్నాయి… పనికల్పిస్తానని ఓ జంటను శ్రీనివాస్ రెడ్డి తీసుకొచ్చాడని స్థానికులు చెప్తున్నారు. కొన్ని రోజులు లిఫ్ట్ మెకానిక్ పనిలో సహాయం చేయించుకున్నాడని, ఆ తర్వాత వాళ్లు ఏమయ్యారో తెలియదని స్థానికులు అంటున్నారు. కల్పన, మనిషా, శ్రావణి లాగే హత్య చేశాడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు….
ఈ క్రిమినల్ నేర చరిత్రపై అధికారులు మరోసారి ఆరా తీయనున్నారు. ఇప్పటికే శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులను, స్నేహితులను విచారించారు. నిందితుడు పనిచేసిన ప్రదేశాల్లో ఏమైనా నేరాలకు పాల్పడి ఉంటాడనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్ ఫోన్‌లో అశ్లీల వెబ్‌సైట్ల సెర్చింగ్‌లే ఉన్నట్లు పోలీసుల పరిశీలనలో తేలినట్లు సమాచారం. వీటిని చూసే బాలికలపై దారుణాలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఇక శ్రావణిని హత్య చేసి బావిలో పాతిపెట్టే టైంలో శ్రీనివాస్‌రెడ్డికి ఎవరైనా సహకరించారా అనే అనుమానాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com