ఎంసెట్‌ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు

ఎంసెట్‌ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు

ఏపీ ఎంసెంట్‌ ఫలితాల విడుదలకు మూహూర్తం కుదిరింది. ఇవాళ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తాడేపల్లిలో ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ విజయరాజు ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతోనే ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేస్తున్నారు. వాస్తవంగా మే 18నే విడుదల చేయాలని భావించినా… చివరికి వాయిదా వేశారు. తెలంగాణకు చెందిన దాదాపు 36 వేల మందికి పైగా విద్యార్ధులు ఏపీ ఎంసెట్‌ రాశారు. వీరి ర్యాంకులు కేటాయించేందుకు ఇంటర్‌ మార్కులు అవసరం కావున.. ఫలితాల విడుదలతో జాప్యం అయింది.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల సమాచారం ఇటీవలే ఏపీ ఎంసెట్‌ అధికారులకు చేరింది. దీని ఆధారంగా ఎంసెట్‌ ర్యాంకులతో ఫలితాల సమచారాన్ని అధికారులు రూపొందించారు. ఆయా విద్యార్ధలు ర్యాంకులు, ఇతర సమాచారం వారి వారి మొబైల్ నెంబర్లకు పంపించనున్నారు.

దాదాపు 2 లక్షల 83 వేలమంది విద్యార్ధులు ఈ ఏడాది ఎంసెట్‌ రాశారు. ఇంజనీరింగ్‌ కోసం లక్షా 85వేల మంది, వ్యవసాయ, వైద్య విద్య పరీక్షకు 82 వేలమంది హాజరయ్యారు. ఈ ఫలితాల కోసం విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story