జాతిపిత విగ్రహానికి అవమానం

జాతిపిత విగ్రహానికి అవమానం

గుంటూరు జిల్లాలో జాతిపిత విగ్రహానికి అవమానం జరిగింది. తాడేపల్లి మండలం పొలకపాడులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వయంగా గాంధీ విగ్రహానికి మరమ్మతులు చేశారు. పాక్షికంగా దెబ్బతిన్న గాంధీ విగ్రహం కాలుకు సిమెంట్ పూసి సరిచేశారు. ఆ తర్వాత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతిపిత విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story