అమిత్ షాతో గవర్నర్ నరసింహన్ భేటీ

తెలుగు రాష్ట్రాల రాజకీయ, పాలన పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చర్చించారు. గవర్నర్ నరసింహన్ అమిత్ షాతో పాటు, ఆ శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, హోంశాఖ ఉన్నతాధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడి.. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గవర్నర్ ఢిల్లీకి వెళ్లారు.
రెండు తెలుగు రాష్ట్రాల పెండింగ్ సమస్యలపై ఇటీవల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు, తీసుకున్న చర్యలను కూడా అమిత్ షాకు గవర్నర్ వివరించినట్టు తెలుస్తోంది. హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా గవర్నర్ కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన నరేంద్ర మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలిసింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com