టీమిండియా ప్రపంచకప్ వేట.. బ్యాటింగ్‌లో వారే కీలకం

టీమిండియా ప్రపంచకప్ వేట.. బ్యాటింగ్‌లో వారే కీలకం

టీమిండియా ప్రపంచకప్‌ వేట రేపటి నుండి ప్రారంభం కాబోతోంది. సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఐపీఎల్ కారణంగా భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఆలస్యంగా రూపొందించడంతో ఆటగాళ్ళకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిన సఫారీలకు కోహ్లీసేనతో మ్యాచ్‌ సవాల్‌గా చెప్పాలి.

ప్రపంచకప్‌ మొదలై మ్యాచ్‌లు జరుగుతున్నా... ఇప్పటి వరకూ సరైన జోష్ కనిపించడం లేదు. దీనికి కారణం టీమిండియా ఇంకా బరిలోకి దిగకపోవడమే.. ఇప్పుడు భారత్‌ వరల్డ్‌కప్‌ వేట మొదలుకాబోతోంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో కోహ్లీసేన సౌతాఫ్రికాతో తలపడనుంది. టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా ఉన్న టీమిండియాకు ఐపీఎల్‌ కారణంగా మ్యాచ్‌ల షెడ్యూల్ ఆలస్యమైంది. కావాల్సినంత విశ్రాంతి దొరకడంతో పాటు గత వారం రోజులుగా నెట్ ప్రాక్టీస్‌లో భారత ఆటగాళ్ళు బిజీగా గడిపారు. గత ప్రపంచకప్‌లో సెమీస్‌కే పరిమితమైన భారత్ ఈ సారి టైటిల్ రేసులో ముందుంది. అయితే లీగ్ స్టేజ్‌లో ఆరంభం నుండే టాప్ టీమ్స్‌తో మ్యాచ్‌లు ఆడబోతోంది. వార్మప్‌లో కివీస్‌పై ఓడినప్పటకీ...బంగ్లాదేశ్‌పై భారీ విజయం కాన్ఫిడెన్స్ పెంచింది.

ప్రపంచకప్ రేసులో దూసుకెళ్ళాలంటే టీమిండియాకు ఓపెనర్లు, కెప్టెన్ విరాట్‌కోహ్లీ కీలకంగా చెప్పొచ్చు. ఓపెనర్లు ఇచ్చే ఆరంభాలకు తోడు కోహ్లీ చెలరేగితే భారీస్కోర్లు ఖాయం. చివర్లో ధోనీ ఫినిషింగ్ టచ్‌, హార్ఠిక్ పాండ్యా మెరుపులపై అంచనాలున్నాయి. ఇక బౌలింగ్‌లో మన పేసర్లు, స్పిన్నర్లు మంచి ఫామ్‌లో ఉండడం అడ్వాంటేజ్‌. సఫారీలపై గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించాలని భారత్ భావిస్తోంది. ప్రాక్టీస్‌లో కోహ్లీ చేతివేలికి గాయమైనప్పటకీ... మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిన సౌతాఫ్రికాకు భారత్‌తో పోరు కఠిన పరీకగానే చెప్పాలి. కీలక ఆటగాళ్ళు గాయలతో బాధపడుతుండడం వారికి మరో మైనస్‌. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నిరాశపరిచిన సఫారీలు కోహ్లీసేనకు ఏమేర పోటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే భారత్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలవడంతో ప్రపంచకప్‌కు సరికొత్త జోష్ రానుంది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌లలో ఎక్కువ శాతం వన్‌సైడ్‌గా ముగియడం అభిమానులను నిరాశపరిస్తే... భారత్‌,సఫారీల మ్యాచ్‌ హోరాహోరీగా సాగాలని వారు కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story