మళ్లీ వచ్చిన నిఫా వైరస్..

మళ్లీ వచ్చిన నిఫా వైరస్..

గత ఏడాది నిఫా వైరస్ కలకలం రేపింది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. కేరళలో కనిపించిన నిఫా వైరస్ అక్కడక్కడా కొన్ని రాష్ట్రాల్లో కనిపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. మళ్లీ ఇప్పుడు మరోసారి నిఫా వైరస్ లక్షణాలతో కేరళ ఏర్నాకులంకి చెందిన 23 ఏళ్ల యువకుడు ఈ వైరస్ లక్షణాలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి బ్లడ్ శాంపిల్స్‌ని టెస్ట్‌ల కోసం మణిపాల్ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు, కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్‌కు పంపించారు.

ఈ రిపోర్టుల్లో నిఫా వైరస్ సోకినట్లు కన్ఫామ్ అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. అయితే వైరస్ గురించి ప్రజలు భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా మందుల్ని సిద్ధంగా ఉంచామని ఆమె అన్నారు. గత ఏడాది కోజికోడ్‌లో వైరస్ సోకిన వారికి ట్రీట్ మెంట్ ఇస్తూ ఓ నర్సు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం అప్పుడు సంచలనంగా మారింది.

ఒక్క కేరళ రాష్ట్రంలోనే వైరస్ కారణంగా గత ఏడాది 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం అలాంటి చర్యలు పునారావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఆమె అన్నారు. ప్రజలకు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు.. ఇండియన్ జనరల్ ఆఫ్ వైరాలజీ ప్రకారం గబ్బిలాలను తాకడం లేదా అవి కొరికిన పండ్లు తినడం ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉందని చెప్పారు.

Read MoreRead Less
Next Story