ఆలస్యంగా రానున్న రుతుపవనాలు.. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కారణం..

ఆలస్యంగా రానున్న రుతుపవనాలు.. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కారణం..

దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు మరో రెండు రోజులు ఆలస్యంగా రానున్నాయి. ఈనెల 8 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం మేఘాలు పశ్చిమ వైపు నుంచి తూర్పు దిశగా కదులుతున్నాయని.. ఎప్పుడైతే రుతుపవనాలు ప్రవేశిస్తాయో.. మేఘాలు దిశ మార్చుకుంటాయని.. వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి ప్రవేశానికి అనుకూలమైన వాతావరణమే ఉందని IMD స్పష్టంచేసింది. తెలుగు రాష్ట్రాలతో సహా.. వివిధ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అవి రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు కాదని అధికారులు చెప్తున్నారు.

Tags

Next Story