కారు స్పీడుకు వార్ వన్ సైడ్.. కేసీఆర్, కవిత ఇలాకాలో షాకిచ్చిన ఓటర్లు

పరిషత్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ రిజల్ట్స్ తరహాలోనే దుమ్మురేపింది టీఆర్ఎస్. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కారు స్పీడుకు వార్ వన్ సైడ్ అయ్యింది. 32కు 32 జడ్పీ పీఠాలు గంపగుత్తగా టీఆర్ఎస్ వశం అయ్యాయి. అటు మండల పరిషత్ లో కూడా టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది. దాదాపు 500కుపైగా మండల పరిషత్ లు కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ ప్రభంజనం ముందు కాంగ్రెస్, బీజేపీ ఎక్కడా ప్రభావం చేపించలేకపోయాయి. కొన్ని జిల్లాల్లో కనీసం ఒక్క సీటు కూడా సాధించలేదు ఆ రెండు పార్టీలు.
మొత్తం 538 జడ్పీటీసీల్లో 428 జడ్పీటీసీలు టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్-73, బీజేపీ-7 జడ్పీటీసీలను దక్కించుకున్నాయి. ఇక 5817 ఎంపీటీసీట్లో టీఆర్ఎస్- 3, 555, కాంగ్రెస్ - 1377, బీజేపీ - 211 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నాయి.
టీఆర్ఎస్ వేవ్ లో కొన్ని జిల్లాలో ఫలితాలు క్లీన్ స్వీప్ అయ్యాయి. కరీంనగర్, జగగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ లో టీఆర్ఎస్ మొత్తం సీట్లను తుడిచి పెట్టేసింది. టీఆర్ఎస్ వేవ్ లో మహబూబ్‌నగర్, కరీంనగర్,వరంగల్ రూరల్,ఆర్బన్,గద్వాలలో
కాంగ్రెస్ ఒక్క జెడ్పీటీసీ సీటు కూడా గెలవలేకపోయింది. బీజేపీ 29 జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 9 జిల్లాల్లో ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా దక్కలేదు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నాయకత్వం.. కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కుఓట్ల వర్షం కురిపించింది. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు సీట్లను సాధించిన టీఆర్ఎస్...ఇప్పుడు ప్రజల నుంచి నేరుగా ఎంపీటీసీ, జడ్పీటీసలను గెలిపించుకొని ప్రజల్లో తమ ఆదరణను మరోసారి చాటుకుంది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో.. మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినా.. సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవిత ఇలాకాలో మాత్రం షాకిచ్చారు ఓటర్లు. కేసీఆర్ దత్తత గ్రామం.. కవిత సొంత ఊరిలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. మాజీ ఎంపీ కవిత స్వగ్రామం నవీపేట మండలం పోతంగల్‌లో ఎంపీటీసీ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 90 ఓట్లకుపైగా తేడాతో బీజేపీ అభ్యర్థి రాజు గెలిచారు. ఇటు కరీంనగర్ జిల్లాలోని కేసీఆర్ దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అటు కేసీఆర్ అత్తగారు ఊరు కుదరుపాకలో కూడా టీఆర్ఎస్ ఓడిపోయింది. టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్ధిపై కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com