పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నా.. ఆమె కోసం అతడు చేసిన పని..

పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు అయినా ఓ మగువను చూసి మనసు పారేసుకున్నాడు. ఆమె క్కూడా అతగాడు తెగ నచ్చేశాడు. చూడబోతే ఆ అమ్మాయి బ్రాహ్మిన్ అని తెలిసింది. అతడు ముస్లిం. రెండూ ఆపోజిట్ డైరక్షన్లు. అందుకోసం ఇమ్రాన్ భాటీ కాస్తా కబీర్ శర్మగా పేరు మార్చుకుని బ్రాహ్మణుడి అవతారం ఎత్తాడు. పెద్దలను కలిసి పెళ్లికి ఒప్పించాలనుకున్నారు.
పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే 13న రూ.11 లక్ష కట్నం, 5 లక్షల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లి చేసి పంపించారు. పెళ్లైన వారానికి మరికొంత కట్నం తెమ్మంటూ భార్యని పుట్టింటికి పంపించారు. ఆ డబ్బు తీసుకుని వచ్చాక ఇద్దరూ కలిసి ఎవరికీ చెప్పకుండా అక్కడ నుంచి బిచాణా ఎత్తేశారు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఓ రోజు కూతురికి ఫోన్ చేసిన తండ్రి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండేసరికి ఆయనకు అనుమానం వచ్చింది.
దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అసలు విషయం వారి విచారణలో బయటపడింది. ఇమ్రాన్ భాటి పెళ్లి కోసం నకిలీ తండ్రి తండ్రులను, నకిలీ బంధువులను సృష్టించాడు. అది తెలుసుకున్న అమ్మాయి తండ్రి షాకయ్యాడు. పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ ఇమ్రాన్ సమకూర్చుకుని పక్కా ప్లాన్ వేసి అమ్మాయితో సహా పరారయ్యాడు. పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com