హాస్పిటల్ బెడ్ మీద స్నేహా ఉల్లాల్‌‌.. ఏమైందంటే..

హాస్పిటల్ బెడ్ మీద స్నేహా ఉల్లాల్‌‌.. ఏమైందంటే..

ఉల్లాసంగా.. ఉత్సాహంగా అంటూ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసిన స్నేహా ఉల్లాల్.. ఆ సినిమా తరువాత కరెంట్, సింహా చిత్రాల ద్వారా ఫేమస్ అయింది. ఈ మధ్య తెర మీద కనిపించక చాలా కాలమైంది. నేనిప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నానంటూ స్నేహ పోస్ట్ పెట్టింది. జీవితంలో మొదటి సారి ఇలా బెడ్ ఎక్కడం. ఎంతకీ జ్వరం తగ్గక పోవడంతో ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. డాక్టర్లు బాగా రెస్ట్ తీసుకోమని చెబుతున్నారు. నాకు మాత్రం చాలా బోర్‌గా ఉంది. ఎంత కష్టమో పొద్దస్తమాను ఇలా పడుకోని ఉండడమంటే. జాయిన్ అయినప్పుడు చాలా భయం వేసింది. నాకేదో అయిపోతోందని. కానీ ఇప్పుడు కొంచెం బెటర్‌గా వున్నాను. నాతోపాటు నెట్‌ప్లిక్స్ ఉండడంతో అంత ఇబ్బంది అనపించడం లేదు. ఇంకా నా గురించి కేర్ తీసుకునే నా వాళ్లు నాతోనే ఉన్నారు. త్వరగా జ్వరం తగ్గిపోయి మళ్లీ బిజీగా మారిపోవాలనుంది. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story