బీజేపీకి షాక్ ..మంత్రివర్గంలో దక్కని చోటు

బీహార్ లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో బెర్తులపై బీజేపీ పట్ల కినుక వహించిన బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ను తిరిగి మహాకూటమిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. నితీష్‌ కుమార్‌ మహాకూటమి గూటికి చేరాలని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ ఆహ్వానించింది. నితీష్‌ కుమార్‌ను బీజేపీ అవమానిస్తున్న క్రమంలో బీజేపీయేతర శక్తుల పునరేకీకరణకు ఇదే సరైన సమయమని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘ్‌వంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల నుంచి పార్టీకి ఒకరి చొప్పున మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయంతో నితీష్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక‍్తం చేశారు. తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరబోదని నితీష్‌ స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి బిహార్‌లో 17 స్ధానాల్లో పోటీ చేసిన జేడీయూ 16 స్ధానాల్లో గెలుపొందడంతో కేంద్ర క్యాబినెట్‌లో ఎక్కువ మందికి చోటు దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు ఆశించినా ఆ మేరకు ప్రాధాన్యం దక్కకపోవడంతో నితీష్‌ కంగుతున్నారు. తాజాగా మంత్రివర్గం విస్తరించిన నితీశ్ కుమార్ కూడా బీజేపీకి మొండిచేయి చూపించారు.

ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ మహాకూటమిలో ఉన్న మాజీ సీఎం జతిన్ రాంజీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. అక్కడ మాంజీతో చర్చలు జరిపారు. ఆయన్ను బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమిలో చేరాలని ఆహ్వానించారు. దీనిపై నితీశ్ ఇంకా స్పందించలేదు. ఎన్డీయేలో అంతా బాగానే ఉందని వ్యాఖ్యానించిన నితీష్‌ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాగైనా జరగవచ్చని పేర్కొనడంతో ఊహాగానాలు ఉపందుకున్నాయి. గత ఎన్నికల్ల ఆర్జేడీతో కలిసి పోటీచేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీశ్.. తర్వాత లాలూతో విబేధించి ఎన్డీచేలో చేరారు. బీజేపీ మద్దతుతో ప్రభుత్వం కొనసాగిస్తున్నారు.

Tags

Next Story