మెుదలైన కౌంటింగ్..వారిదే హవా..

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక్కో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు రెండేసి టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ ఓట్ల లెక్కింపు తర్వాత బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎంపీటీసీ ఓట్లు లెక్కించిన తర్వాత జెడ్పీటీసీ కౌంటింగ్ చేపట్టనున్నారు. జెడ్పీటీసీ కౌంటింగ్ 8 రౌండ్లలో పూర్తికానుంది. అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా ఫలితాన్ని తేల్చనున్నారు. 534 జెడ్పీటీసీ, 5 వేల 659 ఎంపీటీసీల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.
అటు.. ఈ నెల 8న జెడ్పీ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక ఉంటుంది. ఈ నెల 7న మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించనున్నారు. ఐతే.. 32 జెడ్పీలు తమ ఖాతాలోకే వస్తాయని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. వీలైనన్ని జెడ్పీలు నిలబెట్టుకోవాలన్న కాంగ్రెస్‌, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2 కోట్ల 40 లక్షలు ఉన్నందున.. ఫలితాల వెల్లడికి సాయంత్రం వరకూ సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లాలో ఐదుచెట్ల, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మూడు సెంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. సంగారెడ్డి కౌంటర్ లో విద్యుత్ సరఫరా అంతరాయం తలెత్తడంతో.. చీకటి గదుల్లోనే కౌంటింగ్ చేపట్టారు. వరంగల్ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటంగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 8గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు మధ్య లెక్కిస్తున్నారు. రూరల్ జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల కౌంటింగ్ వద్ద ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ హరిత పరిశీలించారు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించారు. ఎంపీటీసీ ఓట్లు మొదటి రెండు రౌండ్లలో లెక్కిస్తారు.. అనంతరం జెడ్పీటీసీ కౌంటింగ్ మొదలవుతుంది. 46 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 6 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి ఫలితాలు తెలనున్నాయి.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. బ్యాలెట్‌ బాక్స్‌ ఓపెన్‌ చేయగానే.. బ్యాలెట్‌ పేపర్లు చెదలు పట్టి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. మహదేవ్‌పూర్‌ మండలం అంబటిపల్లి సూరారంలోని . ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్లకు చెదలు పట్టాయి. ఇదే విషయంపై అధికారులు కలెక్టర్‌కు సమాచారమిచ్చారు. చెదలు పట్టిన బ్యాలెట్‌ బాక్స్‌లో 395 ఓట్లు ఉన్నాయి.

ఖమ్మం బద్రాద్రి జిల్లాలలో zptc,mptc కౌంటింగ్‌ ఆలస్య మయ్యే అవకాశం కనిపిస్తోంది. బ్యాలెట్‌ పేపర్లు కావడంతో పాటు రెండు జిల్లాలలో కౌంటింగ్‌ అరగంట ఆలస్యంగా మొదలవ్వడంతో మధ్యాహ్నం తర్వాత మొదటి mptc ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అందిన అనధికార సమాచారం ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం లభిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు జిల్లాలలోని 481 mptc,41 zptcలకు లెక్కింపు ప్రశాంతంగా జరుగుతోంది. మేడ్చల్ జిల్లాలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కీసరలోని హాస్విత కాలేజీలో జరుగుతోంది. జిల్లాలో ఉన్న 5 ZPTC, 4 MPTCల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story