సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

సీఎం జగన్‌మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో ఉన్న ప్రజావేదికను ప్రతిపక్షనేతగా తనకు కేటాయించాలని లేఖలో కోరారు. తనను కలిసేందుకు ఎమ్మెల్యేలు, సందర్శకులు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంగణాన్ని వినియోగించుకుంటానని తెలిపారు. అందుచేత తన నివాసానికి అనుబంధంగా దీనిని కేటాయించాలని పేర్కొన్నారు.

ఇప్పుడు తాను ఉంటున్న నివాసంలోనే కొనసాగాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రైవేట్ హౌస్‌గా ఉన్న తన నివాసాన్ని యాజమాన్యం షరతుల మేరకు వినియోగించుకుంటున్నానని జగన్‌ కు రాసిన లేఖలో పేర్కొన్నారు .

Tags

Next Story